ఢిల్లీలో AICC ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐసీసీ లీగల్ సెల్ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల తరువాత పదవీ వదులుకోవాలని RSS చీఫ్ మోహన్ భగవత్ సూచించినా ప్రధాని నరేంద్ర మోడీ అందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో అధ్వానీ, మురళీ మనోహర్ జోషికి వర్తించిన వయస్సు మోడీకి వర్తించదా..? మోడీని కుర్చి నుంచి దించడం RSS, BJP వల్ల కాదు.. అది కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే సాధ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ ఆ పని చేసి చూపిస్తారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజా పక్షంలో నిలుస్తుందన్నారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్ ను ముక్కలు చేసిందని.. తీవ్రవాదం పై పోరాటం చేసి.. ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారన్నారు. ప్రధాని పదవీని త్యాగం చేసిన ఘనత సోనియాగాంధీది అని చెప్పారు.