పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహరవీరమల్లు సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. మరో చిత్రం ఓజీ సెప్టెంబర్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే OG మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలవ్వగా.. తాజాగా తొలి పాటను రిలీజ్ చేశారు.
ఫైర్ స్మార్ట్ అంటూ సాగే ఈ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను తెలుగు తో పాటు జపనీస్, ఇంగ్లీషు భాషలో కూడా కలిపి రాసినట్టు తెలుస్తోంది. సాంగ్ కి సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఈ పాటనీ తమిళ స్టార్ హీరో శింబుతో పాటు థమన్, దీపక్, నజీరుద్దీన్, భరత్ రాజ్, రాజకుమారి కలిపి పాడారు. ఈ సాంగ్ తో సినిమా పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సాంగ్ లో తెలుగు లిరీక్స్ ని విశ్వ, శ్రీనివాసమౌళి రాయగా.. ఇంగ్లీష్ లిరిక్స్ ని రాజకుమారి.. జపనీస్ లిరీక్స్ ని అద్వితీయ వొజ్జల రాశారు.