ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం భారత ప్రభుత్వం చేపట్టిన ఒక కీలక కార్యక్రమం. ఇది రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రూపొందించబడింది. తెలంగాణలో ఈ పథకం ద్వారా ఎన్నో లక్షలకు పైగా రైతులు ఏటా 6,000రూపాయలు ఆర్థిక సహాయం పొందుతున్నారు. పీఎం కిసాన్ పథకం పూర్తి వివరాలు ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. భూమి కలిగిన చిన్న రైతులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద అర్హతలు కలిగిన రైతు కుటుంబానికి ఏటా 6,000 రూపాయలను అందించడం జరుగుతుంది. వాయిదా పద్ధతిలో నెలకి 2,000 రూపాయలు చొప్పున నేరుగా ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.
తెలంగాణలో పీఎం కిసాన్ పథకం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు 31 లక్షల రైతులు లబ్ది పొందుతున్నారు. 2019 నుంచి ఈ పథకం ప్రారంభమైనప్పటికీ తెలంగాణ రైతుల ఖాతాలో 27,489 కోట్లు జమ చేయబడ్డాయి. 2023-24 లో 76.59 లక్షల మంది రైతులకు 4,857 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ పథకం తెలంగాణలో రైతులు ఆర్థిక భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అర్హతలు, నిబంధనలు : పీఎం కిసాన్ పథకం కింద భూమి కలిగిన చిన్న రైతు కుటుంబాలు లో భార్య, భర్త మైనర్ పిల్లలు అర్హులు అవుతారు. ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు 10,000 కు పైన పెన్షన్ పొందేవారు, వైద్యులు, లాయర్లు, వంటి వృత్తిపరమైన వారు ఈ పథకం కి అర్హులు కాదు. అర్హత కలిగిన రైతులు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలతో WWW.PMKISAN.GOV.IN లో స్వయంగా నమోదు చేసుకోవచ్చు లేదా స్థానిక CSC కేంద్రాల ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
తెలంగాణలో పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. రైతు అప్పుల భారీ నుంచి కాపాడుతుంది ఈ పథకం తెలంగాణ రైతు బంధు పథకంతో సమన్వయం చేసుకొని రైతుకు 10,000రూపాయలు (రైతుబంధు పథకం) మరియు 6,000 రూపాయలు పీఎం కిసాన్ పథకం కలిపి 16,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ డబ్బు రైతులకు వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేయడానికి, పంట కు కావలిసిన పురుగుమందులు కొనుగోలు చేయటానికి,వారి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది.