ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

-

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడలేదని, కేంద్రం అనేక నిబంధనలతో కొర్రీలు వేస్తోందన్నారు. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 1.52 లక్షలు కేంద్రం ఇస్తుందని కానీ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తుందని తెలిపారు.

కేంద్రం సూచించిన విధంగా రీసర్వే కూడా చేపట్టామని ఇది తుది దశలో ఉందన్నారు. వాస్తవానికి లబ్దిదారుల ఎంపికలో కేంద్ర నిబంధనల కంటే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలే పకడ్బందీగా ఉన్నాయన్నారు. ఇండ్ల నిర్మాణ పనులు కూడా ఆశించిన స్థాయిలో పురోగతిలో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశ దిశ లేకుండా గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని వీటిలో చాలా వరకు అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నాయని కనీస వసతులు కూడా లేవని అన్నారు. వీటన్నింటికీ అవసరమైన మరమ్మతులు చేపట్టి లబ్దిదారులకు కేటాయించబోతున్నామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news