హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివుడు, విష్ణువు లక్ష్మీ ఇతర దేవతలు ఆరాధనకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసంలో కలలో కొన్ని కనిపించడం అశుభ సంకేతంగా భావిస్తారు. ఇవి ప్రమాదమా లేక ఆరోగ్య, ఆర్థిక సమస్యలకు సూచనగా ఉండవచ్చా అనేది తెలుసుకోవడం ముఖ్యం. వాటిని నివారించే మార్గాలను ఇప్పుడు మనం చూద్దాం..
పాము విషసర్పాలు : శ్రావణమాసంలో కలలో పాము లేక విషసర్పాలు కనిపించడం అశుభసంకేతంగా పరిగణించబడుతుంది. ఇది శత్రుత్వం ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టానికి సూచిస్తుంది. కలలో ఇవి కనిపిస్తే, కంగారు పడకుండా దగ్గరలోని శివాలయం లేదా నాగదేవతలకు పాలాభిషేకం చేయడంవలన శుభ ఫలితాలు పొందవచ్చు.
మరణం లేదా శవం: ఈ మాసంలో కలలో మరణం లేదా శవం కనిపించడం అశుభంగా భావించబడుతుంది. ఇది కుటుంబంలోని ఒత్తిడి, అనారోగ్యం, ఆర్థిక సమస్యలను సూచిస్తుంది ఒకవేళ కలలో ఇలా కనిపిస్తే దగ్గరలోని శివలింగానికి బిల్వపత్రాలతో పూజ చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వంటి చర్యలతో సమస్యను తగ్గించుకోవచ్చు.
నీరు లేక గంగలో మునిగిపోవడం: శ్రావణమాసంలో కలలో నీటిలో మునిగిపోవడం గంగా నదిలో ఉన్నట్లు కనిపించడం, జరిగితే, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం క్షీణించడం, ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడం, అస్థిరతకు సూచనగా చెబుతారు. ఒకవేళ కలలో ఇవే కనిపిస్తే గంగా స్తోత్రం పటించడం, విష్ణు సహస్రనామ స్తోత్రం జపించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.
ఇల్లు లేదా ఆలయం కూలిపోవడం: కలలో ఇల్లు లేక ఆలయం కూలిపోవడం కనిపిస్తే ఇది కుటుంబంలో ఆ శాంతికి ఆర్థిక నష్టానికి సంకేతం. శ్రావణమాసంలో ఇలాంటి కల వస్తే శివుడికి రుద్రాభిషేకం చేయడం దానాలు చేయడం వలన సమస్యను తొలగిస్తుంది.
నల్ల జంతువులు: శ్రావణమాసంలో కలలో నల్ల జంతువులు నల్ల పిల్లి లేదా కాకి కనిపిస్తే శని దోషం, అశుభ శక్తుల సూచనగా భావించబడుతుంది. ఇవి కలలో కనిపిస్తే శనివారం రోజు శని దేవుడికి నల్ల నువ్వులు సమర్పించడం శని స్తోత్రాలు పటించడం వలన ఉపశమనం కలుగుతుంది.
నివారణ: శ్రావణమాసంలో కలలో పైన తెలిపినవి కనిపిస్తే శివ పూజ, విష్ణు ఆరాధన హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఉదయం త్వరగా లేచి సూర్య నమస్కారం చేయడం తులసి మొక్కకు నీరు పోయడం సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే గుడిలో దీపం వెలిగించడం పేదవారికి ఆహారాన్ని పంచివడం ఇలాంటి పనులు చేయడం వలన ఎన్నో దోషాల నుంచి విముక్తి పొందవచ్చు.
శ్రావణమాసం ఆధ్యాత్మిక శక్తితో నిండిన మాసం ఈ సమయంలో కలలో అశుభ సంకేతాలు కనిపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకుండా సరైన ఆధ్యాత్మిక చర్యలతో నివారించుకోవడం మంచిది.
గమనిక: (పైన తెలిపినవి కేవలం అవగాహన కోసం మాత్రమే)