మహిళలు గత కొన్నేళ్ల క్రితం వరకు పీరియడ్స్ టైం లో మెత్తటి చీరలను, పంచెలను వాడేవారు. కానీ ఇప్పుడు అలా వాడుతున్న వారు ఎవరు లేరు.మహిళలకు పీరియడ్స్ టైం లో సౌకర్యవంతంగా సులభంగా అందుబాటులో ఉండే ఏకైక పరికరం సానిటరీ ఫ్యాడ్స్. అయితే వీటిని సరైన రీతిలో ఉపయోగించకపోతే లేక వీటినాణ్యత చూసుకోకుండా వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు మరి శానిటరీ ప్యాడ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వాటి నిజాలు నివారణ చర్యలను ఇప్పుడు చూద్దాం..
చర్మ సమస్యలు : ఈ శానిటరీ ప్యాడ్స్ లో ఉపయోగించే సింథటిక్ పదార్థాలు రసాయనాలు, చర్మం దురద, ఎరుపు దద్దుర్లను కలిగించవచ్చు. ఈ సమస్యలు ముఖ్యంగా సున్నితమైన చర్మం కలిగిన మహిళల్లో కనిపిస్తాయి. ఒకే ప్యాడ్ ఆరు గంటలకు మించి ఉపయోగించడం వల్ల చర్మంలోని బ్యాక్టీరియా పెరిగి తేమ కోల్పోయి వేడిగా మరి చర్మం పై ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. నాణ్యమైన సింథటిక్ రహిత పాడ్స్ ఎంచుకోవడం వల్ల ప్రతి నాలుగు గంటలకు మార్చుకోవడంతో ఈ సమస్యను తగ్గించవచ్చు.
ఇన్ఫెక్షన్స్ : ప్యాడ్స్ లోని ప్లాస్టిక్ లైనర్లు గాలి ఆడకుండా చేసి తేమను బంధిస్తాయి అలా చేయడం వల్ల బ్యాక్టీరియల్ వేగినోసిస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. సుగంధద్రవ్యాలు కలిసిన ప్యాడ్స్ యోనిలో సహజ బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్ ఏదైనా కలిగితే,ఆర్గానిక్ కాటన్ ప్యాడ్స్ లేదా పర్యావనాహిత పాడ్స్ వాడడం వల్ల రోజు శుభ్రమైన లోదుస్తులు ధరించడంతో ఇలాంటి ఇన్ఫెక్షన్ నివారించవచ్చు.
ప్రస్తుతం మనకు మార్కెట్లో అందుబాటులో ఎన్నో రకాల సానిటరీ ప్యాడ్స్ దర్శనమిస్తున్నాయి. ఎక్కువ రోజులు అవి పాడవకుండా ఉండాలన్న ఉద్దేశంతో, తయారీ సమస్యలు కెమికల్స్ ని వాడుతున్నారు. ప్యాడ్స్ కొనే ముందే ఒకసారి నాణ్యత, చెక్ చేసుకోవడం మంచిది.
నాణ్యతలేని ప్యాడ్స్ లోని ప్లాస్టిక్ రసాయనాలు చర్మం ద్వారా లోపలికి వెళ్లి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు అలాగే ఈ పాడ్స్ మట్టి లో కలవవు కానందున పర్యావరణానికి కూడా హాని కలిగిస్తాయి. అందుకే పర్యావరణహిత ఉత్పత్తులను ఎంచుకోవడం ఆరోగ్యం. ఇప్పుడు మార్కెట్లో క్లాత్ తో తయారు చేసిన సానిటరీ నాప్కిన్సు అందుబాటులోకి వచ్చాయి. అటువంటి వాటిని వాడడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు వెల్లడిస్తున్నారు.
సానిటరీ పాడ్స్ సౌకర్యవంతమైనప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవడం తరచూ మార్చుకోవడం వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వలన సమస్యల నివారించవచ్చు మహిళల తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి పైన తెలిపిన చర్యలను రోజువారి జీవనంలో భాగం చేసుకోవాలి.
గమనిక: పైన తెలిపినవి కేవలం సమాచార అవగాహన కోసం మాత్రమే, ఏదైనా సమస్య ఉంటే వెంటనే దగ్గరలోని వైద్యుని సంప్రదించండి.