నల్గొండలో బీఆర్ఎస్ నాశనం కావడానికి లిల్లీపుట్ నాయకుడే కారణం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. నల్గొండ బీఆర్ఎస్ ను నాశనం చేసిన నాయకుడు నా గురించి మాట్లాడుతున్నాడు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఒక్కడే గెలిచాడు. లిల్లిపుట్ నాయకుడు నా గురించి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందని వ్యక్తి చేత నన్ను తిట్టిస్తున్నారు.
మన పార్టీలో ఉండి ఇలా చేయడం దారుణం.. నా మీద కించ పరిచేవిధంగా మాట్లాడిన నాయకుడు నాయి బ్రాహ్మణులను కించ పరిచేవిధంగా మాట్లాడారు. ఆ లిల్లిపుట్ నాయకుడి గురించి చాలా తక్కువ మాట్లాడాలి అని కవిత తెలిపారు. నా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. యావత్ తెలంగాణ ఖండించింది. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం రియాక్ట్ కాలేదు.