గ్యాస్ సిలిండర్ పేలి.. ఒకరు మృతి చెందారు. మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ లో ఓ ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి మృతి చెందగా, ఇల్లు పూర్తిగా ధ్వంసం ఐంది. ఈ ప్రమాద ఘటనలో తీవ్రంగా మరో ముగ్గురు గాయపడ్డారు.

ఈ సంఘటన పై ఏసీపీ శంకర్ రెడ్డి స్పందించారు. మేడ్చల్ మార్కెట్ లో జరిగిన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారని పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఆరా తీస్తున్నాం… 50 ఏళ్ల పురాతన బిల్డింగ్ లో ప్రమాదం జరిగిందన్నారు ఏసీపీ శంకర్ రెడ్డి.
పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి..
మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ లో ఓ ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో చెలరేగిన మంటలు
పేలుడు ధాటికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి మృతి, ఇల్లు పూర్తిగా ధ్వంసం
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు pic.twitter.com/4H3Kvun3CO
— BIG TV Breaking News (@bigtvtelugu) August 5, 2025