కాంగ్రెస్ నేతపై బాటిల్ విసిరిన BRS ఎమ్మెల్యే… రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!

-

 

 

కుమురం భీమ్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఆసిఫాబాద్ మండలం జన్కపూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి ఇద్దరు సహనం కోల్పోయారు. దీంతో ఎమ్మెల్యే లక్ష్మి కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ పై నీళ్ల బాటిల్ విసిరేశారు. అనంతరం అక్కడే ఉన్నా మిగతా వాటర్ బాటిల్స్ అన్నింటినీ అత్తడిపై విసిరేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా, ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు.

కాంగ్రెస్ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా బీఆర్ఎస్ నేతలను తప్పుద్రోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందని సీరియస్ అవుతున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news