రాహుల్ గాంధీపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణలో రాహుల్ గాంధీ చేసింది కూడా ఓటు చోరీ కాదా ? అని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలపై రాహుల్ గాంధీని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టోలో 420 హామీలు 100 రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పి గెలిచి.. ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ఉండటం ఓటు చోరీ కిందకి రాదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు కేటీఆర్.

బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చోరీ పై రాహుల్ గాంధీ పోరాడుతున్న నైపథ్యంలో మీరు తెలంగాణలో చేసేది ఎంటి అని నిలదీశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబీమా ప్రీమియం చెల్లించకుండా జాప్యం చేయడం మూలంగా వేలాదిమంది రైతు కుటుంబాలు బీమా సాయం కోసం ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆగస్టు 14తో రైతుబీమా ప్రీమియం గడువు ముగుస్తుంది. దీంతో ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేయడం ఆనవాయితీ అన్నారు.