మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి మరో సంచలన పోస్ట్.. భట్టి ఫోటో షేర్ చేసి మరీ

-

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇస్తానని హై కమాండ్ మాట ఇచ్చిన విషయాన్ని, మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని వాస్తవాలను ప్రజలకు తెలిపినందుకు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Komatireddy Rajagopal Reddy thanked Bhatti Vikramarka
Komatireddy Rajagopal Reddy thanked Bhatti Vikramarka

 

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీని అమ‌లు చేయ‌కుండా రాష్ట్ర ముఖ్య‌ నేత‌లు అడ్డుకుంటూ, అవ‌మానిస్తున్న‌ వాస్త‌వాన్ని మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించిన మీకు ధ‌న్య‌వాదాలు చెప్పారు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు త‌మ‌కు ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ స‌ర్కారు అమ‌లు చేయాల‌ని, అవినీతి ర‌హిత‌ పాల‌న అందించాల‌ని కోరుతున్నారు. తెలంగాణ స‌మాజ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న ఉండాల‌ని ఆశిస్తున్నాను అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news