నాగపూర్ లో హృదయ విధారకర ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. నిన్న నాగపూర్ – జబల్పూర్ హైవే పైడా ఓ ట్రక్కు ఢీకొట్టడంతో గ్యార్సి అమిత్ యాదవ్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్ళముందే తన భార్య చనిపోవడం చూసి భర్త గుండెలు పగిలేలా ఏడ్చాడు. సాయం కోసం వాహనదారులను ఏడుస్తూ వేడుకున్నాడు. అయినా ఎవరూ కూడా అతడిని చూసి సాయం చేయడానికి ముందుకు రాలేదు.

దీంతో ఎంతో బాధతో కన్నీరు పెట్టుకుంటూ తన భార్య శవాన్ని బైక్ పై కట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుండగా ఇది చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. తన భార్య మరణాన్ని చూసి అమిత్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ వీడియో చూసిన అనంతరం అతనికి సహాయం చేయొచ్చు కదా. కనీస మానవత్వం లేకుండా ఇలా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.