పులివెందుల జడ్పిటిసి ఎన్నికల కోసం పోలింగ్ బూత్ లను మార్చడం సరికాదు అంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. గ్రామాలలో టిడిపి నేతలు ఓట్ల కోసం డబ్బులను పంచుతున్నారు. డబ్బులు ఇచ్చి మరి ఓటర్ స్లిప్పులు తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న స్లిప్పులతో దొంగ ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.

రిగ్గింగ్ చేసినట్లు సీసీ కెమెరాలలో కనబడకుండా చేశారని చెప్పారు దొంగ ఓట్లను వేయడానికి టిడిపి నేతలు మనుషులను తీసుకువచ్చారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తక్షణమే అందరికీ ఓటర్ స్లిప్పులను అందించాలని వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో రేపు జడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి. పులివెందులలో టిడిపి పార్టీ ఎలాగైనా విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి టిడిపి పార్టీ వేసే స్కెచ్ లను వైసిపి పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.