వైసీపీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పులివెందుల ఎన్నికల్లో బూత్‌లను యథావిథిగా కొనసాగించాలని ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలింగ్ బూత్ మార్పు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్పు చేసిన 6 బూత్‌ల్లోనే పోలింగ్ కొనసాగనుంది. మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.

ఇక అటు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందుల జడ్పిటిసి ఎన్నికల కోసం పోలింగ్ బూత్ లను మార్చడం సరికాదు అంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. గ్రామాలలో టిడిపి నేతలు ఓట్ల కోసం డబ్బులను పంచుతున్నారు. డబ్బులు ఇచ్చి మరి ఓటర్ స్లిప్పులు తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న స్లిప్పులతో దొంగ ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. రిగ్గింగ్ చేసినట్లు సీసీ కెమెరాలలో కనబడకుండా చేశారని చెప్పారు దొంగ ఓట్లను వేయడానికి టిడిపి నేతలు మనుషులను తీసుకువచ్చారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.