న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల్లో సంభవించే ఒక తీవ్రమైన అంటు వ్యాధి. ఇది శ్వాస కోస వ్యవస్థను భావిస్తుంది. ఇది బ్యాక్టీరియా వైరస్, ఫంగస్ ఇతర సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తుంది. ఇది ఊపిరితిత్తుల్లోని గాలి సంచులను దెబ్బతీస్తుంది. న్యూమోనియా రావడానికి కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా గుర్తించడం వల్ల సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
న్యూమోనియా కారణాలు: ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉంటాయి మొదట బ్యాక్టీరియా ఇదిస్ట్రెప్టోకాకస్ న్యూమోనియా వంటి బ్యాక్టీరియా వల్ల న్యూమోనియా దారితీస్తుంది. వైరస్ లలో ఇన్ఫ్లుఎంజా, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) వంటి వాటి వల్ల న్యూమోనియా కలిగిస్తాయి. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. వీటి ద్వారా కూడా ఈ వ్యాధి కలుగుతుంది. అంతేకాక రసాయనాలు, కాలుష్యం విషపూరిత పదార్థాలు వలన న్యూమోనియా దారితీస్తుంది. అంతేకాక ధూమపానం, అధిక మధ్యపానం రోగ నిరోధక శక్తి తగ్గించే ఆహారపు అలవాట్లు కూడా ఈ వ్యాధికి కారణం అవుతాయి. ఇక డయేరియా,ఎయిడ్స్,దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఈ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి.
నివారణ మార్గం: కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఇద్దరు కాలిక వ్యాధులు బారిన పడేవారు న్యూమోనియా ఎక్కువగా గురవుతారు. ఈ కారణాలను తెలుసుకోవడం వల్ల ప్రమాద కారకాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవచ్చు. కారణాన్ని బట్టి చికిత్స విధానం కూడా మారుతుంది బ్యాక్టీరియా వల్ల వచ్చే న్యూమోనియా యాంటీబయటిక్స్ అందించి తీవ్రతను తగ్గింప చేస్తారు. ఈ వ్యాధి నివారణ కోసం టీకాలను వేసుకోవడం ధూమపానం మానివేయడం సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. తరచూ చేతులను కడుక్కోవడం అంటి వ్యాధులకు దూరంగా ఉండడం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వలన ఈ వ్యాధి సంభవించకుండా నివారించవచ్చు.
వ్యాక్సినేషన్:ఈ వ్యాధి బాడిన పడిన వారు కారణాలను తెలుసుకొని దానికి సంబంధించిన నివారణా చర్యలు తీసుకోవాలి. బ్యాక్టీరియా, వైరల్ టీకాలు (వ్యాక్సినేషన్) తీసుకోవడం లేదా ఇన్ఫ్లుఎంజా టీకా తీసుకోవటం వలన న్యూమోనియా వ్యాధి సంభవించే అవకాశం తగ్గుతుంది. ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని వైద్యున్ని సంప్రదించడం ముఖ్యం.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే )