BRS పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. పైలెట్ రోహిత్ రెడ్డి… కూడా BRS పార్టీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ కనిపిస్తోంది. బీజేపీలో చేరనున్నారట పైలెట్ రోహిత్ రెడ్డి. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే బీజేపీలో చేరారు గువ్వల బాలరాజు.

రేపో మాపో కాషాయ కండువా కప్పుకోనున్నారట మరికొందరు. ఈ క్రమంలో త్వరలోనే పైలెట్ రోహిత్ రెడ్డి సైతం బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.