టిడిపి మాజి ఎంపీ అల్లుడు పులివెందుల డీఐజీ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. పులివెందుల ఉప ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చ చొక్కా వేసుకున్నట్టు ఎన్నికల్లో దౌర్జన్యాన్ని దగ్గరుండి చూసుకున్నాడని మండిపడ్డారు.

టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు అల్లుడే ఈ డీఐజీ కోయ ప్రవీణ్ అని నిప్పులు చెరిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నికలు కావొచ్చు.. ఇప్పటికైనా కృష్ణా రామా అనుకుంటే పుణ్యమైన వస్తుంది, లేదంటే నరకానికి పోతావు అని హాట్ కామెంట్స్ చేశారు వైఎస్ జగన్. కలెక్టర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారు… జమ్మలమడుగుకు చెందిన సందీప్, దస్తగిరి దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు చేశారు. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ ని మండిపడ్డారు.