సిద్దిపేటలో వర్షాలు…పడుతున్నాయి. ఐన కూడా చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ చేశారు. సిద్దిపేటలోని నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన లైన్ను పునరుద్ధరించేందుకు లైన్మెన్ హైముద్దీన్ సాహసం చేశారు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి స్తంభం ఎక్కి కనెక్షన్ ఇచ్చి విద్యుత్ ని పునరుద్ధరించారు.
కాగా తెలంగాణలో 11 జిల్లాలకు IMD మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించారు.
రెండు రోజులపాటు హైదరాబాద్ లాంటి మహా నగరాలలో ఆఫీసులకు సెలవు ఇచ్చారు. ఇంటి నుంచే పని చేయాలని స్పష్టం చేశారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు పడే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.