వివాదంలో ప్రభాస్ మూవీ ‘రాజాసాబ్’ చిక్కుకుంది. ‘రాజాసాబ్’ మూవీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై కేసు నమోదు అయింది. రూ.218 కోట్లు తిరిగి ఇవ్వాలంటూ.. రాజాసాబ్ సినిమాకు ఆర్థిక భాగస్వామి అయిన IVY ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థ కేసు నమోదు అయింది. షెడ్యూల్ ప్రకారం సినిమాని పూర్తి చేయలేదని.. తమకు ఇతర వివరాలు కూడా ఇవ్వడం లేదంటూ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది ఆ సంస్థ.

అందుకే.. తాము ఇచ్చిన రూ.218 కోట్లు ‘ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ నుం చి ఇప్పించాలని IVY ఎంటర్టైన్‌మెంట్స్ కంపెనీ డిమాండ్ చేస్తోంది. ఇందుకు కౌంటర్‌గా కోర్టుని ఆశ్రయించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. నాన్-థియేట్రికల్ డీల్ ఇంతవరకూ క్లోజ్ కాలేదని వివరణ ఇచ్చింది. కొన్ని కారణాల వల్లే సినిమా వాయిదా పడిందని.. IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ పరువుకి భంగం కలిగిస్తోం దంటూ ఫిర్యాదు చేసింది.