కొత్త వాహనాలు కొనేవారికి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం… ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నేటి నుండి కొత్త ట్యాక్స్ విధానం అమలులోకి రానుంది. అదనపు ఆదాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాట్లు.. ప్రజలపై భారం నెట్టేసి చేతులు దులుపుకుందని రేవంత్ రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి.

కొత్త వాహనాల కొనుగోలు సమయంలో చెల్లించే లైఫ్ ట్యాక్స్ మొత్తాన్ని సవరించిన ప్రభుత్వం… వాహన ధరల ఆధారంగా ఇప్పటివరకు అమలులో ఉన్న శ్లాబులను పెంచటం ద్వారా వీలైనంత మేర పన్ను ఆదాయం పెరిగేలా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల ధరలను కూడా భారీగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.