RTC బస్సులో సీఎం చంద్రబాబు ప్రయాణం .. డెమో

-

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. డెమో విడుదల చేశారు. నేడు స్త్రీ శక్తి పథకం ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి నుంచి పండిట్ నెహ్రూ బస్టాండుకు సీఎం చంద్రబాబు నాయుడు బస్సులో ప్రయాణించే అవకాశం ఉంది.

free bus
free bus

ఐదు బస్సులను స్త్రీ శక్తి పథకం కోసం జెండా ఊపి ప్రారంభించనున్నారు చంద్రబాబు. కాగా స్త్రీ శ క్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన తర్వాత జీరో ఫేర్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విజయవాడ PN బస్టాండ్ లో ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. కాగా, నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి, తిరుమల, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సులలో స్త్రీ శక్తి పథకం వర్తించదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news