జీవిత భాగస్వామి సంబంధంలో ప్రేమ తగ్గుతుంది అని తెలిపే సూచనలు..

-

ఈ రోజుల లో లవ్ మ్యారేజి, అరేంజ్డ్ మ్యారేజి ఏదైనా కానివ్వండి భార్యాభర్త కలిసి వందేళ్లు సుఖంగా ఉండాలని అనుకుంటారు. కానీ పెళ్లయిన కొత్తల్లో ఉండే ప్రేమ ఎఫెక్షన్ కొంతకాలానికి తగ్గడం గమనిస్తాం. ఇది అందరిలో జరుగుతుందని కాదు కానీ కొందరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.జీవిత భాగస్వామి సంబంధం అనేది ప్రేమ విశ్వాసం పరస్పర అవగాహన పై ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పార్ట్నర్ పై ప్రేమ తగ్గుతుందని లేదా దూరం పెరుగుతున్నట్లు కనిపించవచ్చు. ఈ సూచనలను సకాలంలో గుర్తించడం వల్ల సంబంధాన్ని మెరుగుపరుచుకోవడమే కాక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మరి జీవిత భాగస్వామి ప్రేమ తగ్గుతున్నట్లు తెలిపే సూచనలను మనము తెలుసుకుందాం..

కమ్యూనికేషన్ తగ్గడం: పార్ట్నర్స్ మధ్య ప్రేమ తగ్గుతున్నప్పుడు భాగస్వాముల మధ్య సంభాషణలు తగ్గిపోతాయి. గతంలో లాగా ఓపెన్ గా మాట్లాడటం లేదా వారి భావనలు పంచుకోవడం తగ్గిస్తారు. ఒకరిపై ఒకరు మాట్లాడే సమయం తగ్గడం లేదా ఏదో మాట్లాడి వెళ్లిపోవడం గమనిస్తే వెంటనే దాని గురించి అడగడం ముఖ్యం. ముఖ్యమైన విషయాలను పంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు రహస్యంగా ఏదైనా విషయాన్ని దాచాలి అనుకుంటున్నారేమో కనుక్కోవాలి చిన్నచిన్న విషయాలపై తరచూ వాదనలు ఉంటే వాటిని తగ్గించండి.

Signs Your Spouse’s Love Is Fading in the Relationship
Signs Your Spouse’s Love Is Fading in the Relationship

భావోద్వేగ దూరం : భాగస్వాముల మధ్య భావోద్వేగ అనుబంధం బలహీనపడుతుంది అని ప్రేమ తగ్గినప్పుడు అనిపిస్తుంది. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోకుండా, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు గడిపేస్తుంటే పక్క వారు మన పై శ్రద్ధ చూపించడం లేదని ప్రేమ తగ్గిందని మన భావోద్వేగా ఫీలింగ్స్ ని పార్ట్నర్ పంచుకోనప్పుడు ప్రేమ తగ్గినట్లు భావిస్తాం. అలా కాకుండా ఇద్దరు వారి ఆనందాన్ని లేదా బాధను కలిసి పంచుకోవాలి. ఒకరి సమస్యను పరిష్కరించడంలో ఆసక్తి చూపించాలి సాధారణంగా ఒకరితో ఒకరు ఎమోషనల్ ఫీలింగ్స్ కోసం కొంత సమయాన్ని గడపాలి.

శారీరక సన్నిహిత్యం తగ్గడం : పార్ట్నర్ మనపై ప్రేమ తగ్గింది అని మనకి ముఖ్యంగా అనిపించేది శారీరక సన్నిహిత్యం తగ్గడం వలన అది ఒక చిన్న ముద్దు లేదా ఆలింగణం లేదా ఇతర సన్నిహిత క్షణాల్లో కనిపిస్తుంది. ఒకరినొకరు తాకడం హగ్ చేసుకోవడం తగ్గించినప్పుడు, మనపై పార్ట్నర్ కి ప్రేమ తగ్గిందని భావిస్తాం. శారీరక సన్నిహిత్యం పట్ల ఆసక్తి కోల్పోయిన అసౌకర్యంగా భావించిన, మన స్పర్శను వద్దని అసహనం చూపిస్తున్న మన పై పార్ట్నర్ కి ప్రేమ తగ్గిందని భావించవచ్చు. ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపడం తగ్గించిన ఒకరి అవసరాలు ఇష్టాలు ఆసక్తులపై శ్రద్ధ చూపడం తగ్గించిన, పుట్టినరోజులు పెళ్లిరోజు మర్చిపోవడం ఇవన్నీ కూడా ప్రేమ తగ్గిందని భావించవచ్చు.

పై సూచనలు మీ భాగస్వాములో కనిపిస్తే సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి.

మీ భావాలను బహిరంగంగా చర్చించండి భాగస్వామి ఆలోచనలను గౌరవించండి. కలిసి కొంత సమయం గడపండి. వినోదం లేదా ఏదైనా మంచి సినిమా చూడండి. ఒకరినొకరు ఓపెన్ గా మాట్లాడుకోండి. సమస్య ఏదైనా ఇద్దరు కలిసి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇవేమీ కుదరనప్పుడు సంబంధ సమస్యలను పరిష్కరించడానికి ప్రొఫెషనల్ కౌన్సిలర్ సహాయం తీసుకోండి. ఒకరిపై ఒకరు విశ్వాసం గౌరవం పెంచే పనులను చేయండి. ఈ చర్యలను సకాలంలో చేయడం వల్ల మీ బంధం మెరుగు పడుతుంది. సంబంధంలో ప్రేమను నిలబెట్టడానికి పార్ట్నర్స్ ఇద్దరు కలిసి ప్రయత్నించడం ఒకరి భావాలు ఒకరు గౌరవించడం చాలా ముఖ్యం.

 

Read more RELATED
Recommended to you

Latest news