ఏడుపాయల దేవాలయం వెళ్లేవారికి బిగ్ అలర్ట్. ఏడుపాయల దేవాలయం..నీటమునిగింది. సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలకు మంజీర నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో..మూడు రోజులుగా నీటిలో ఉండిపోయింది ఏడుపాయల దేవాలయం. గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.

కాగా నాగార్జునసాగర్ లో ఏకంగా 14 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. మరో రెండు రోజులపాటు ఇలానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు రాకూడదని చెబుతున్నారు. వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తున్నాయని చిన్నపిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నీటమునిగిన ఏడుపాయల దేవాలయం..!!
సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలకు మంజీర నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో..మూడు రోజులుగా నీటిలో ఉండిపోయిన ఏడుపాయల దేవాలయం pic.twitter.com/XG5RAcT5JB
— Mirror TV (@MirrorTvTelugu) August 16, 2025