తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. దీంతో.. తిరుమల శ్రీవారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. వరుసగా మూడు రోజులపాటు హాలిడేస్ రావడంతో…. జనాలు మొత్తం తిరుమలకు తరలి వెళ్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది.

టోకెన్లు లేని వారికి తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం తిరుమల శ్రీవారి క్యూ లైన్ శిలాతోరణం నుంచి కూడా సాగుతోంది. శనివారం రోజున 87,759 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 42,000 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీ 4.16 కోట్లుగా నమోదయింది.