జీవనోపాధి కోసం అని వెళ్లి…కరోనా వల్ల ఇరుక్కుపోయాడు,చివరికి

-

ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి సోకి ఎందరో బలి అవుతుంటే, మరికొందరు ఈ మహమ్మారి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా జీవనోపాధి కోసం అని గల్ప్ వెళ్లిన ఒక యువకుడు తన నిండు ప్రాణాన్ని కరోనా కారణంగా బలితీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే… తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర వారంలో ఉల్లి తోట వీధి బంగారయ్య స్కూల్ లో నివసిస్తున్న వనపర్తి లక్ష్మి,వనపర్తి వెంకటెశ్వరరావులకు ఇద్దరు సంతానంఒక అబ్బాయి,ఒక అమ్మాయి. అయితే కూతురుకి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. అయితే కుమారుడు మహేష్ మాత్రం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా అప్పుల బాధ ఎక్కువ అవ్వడం రుణ దాతలు ఒత్తిడి తీసుకురావడం తో డబ్బు సంపాదించాలని ఆటోను అమ్మి, మరికొంత అప్పు చేసి మరి కొద్దీ రోజుల క్రితం బహ్రెయిన్ కు వెళ్ళాడు. వెళ్లడమైతే అక్కడికి వెళ్లాడు గానీ.గల్ఫ్‌లో అడుగుపెట్టగానే అతనికి అనారోగ్యం సోకింది.ఇక అక్కడ ఉండబట్టలేక భారతదేశానికి తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు.మార్చి 22న టికెట్ బుక్‌ చేసుకుని, తాను ఇండియాకు వచ్చేస్తున్నానని చెల్లెలు రత్నానికి ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయం అమ్మకు చెప్పొద్దని సర్‌ప్రైజ్ చేస్తానంటూ చెల్లితో కబుర్లు చెప్పాడు.భారత్‌కు ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనుకుంటున్న తరుణంలో ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుండటంతో దేశాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో దాదాపు అన్ని దేశాలు కూడా అంతర్జాతీయ సర్వీసులన్నీ రద్దు చేశాయి. దీంతో మహేష్ అక్కడే ఇరుక్కుపోయాడు. ఇక ఇప్పట్లో ఇండియాకు వెళ్లలేనని, అమ్మానాన్నలను చూడలేనని మహేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.ఆ బెంగతో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.

అయితే కొడుకు తమను చూడడానికి తిరిగి వస్తాడు అని భావిస్తున్న తల్లిదండ్రులకు మహేష్ మరణ వార్త తెలియడం తో వారు ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా దేశం కానీ దేశములో చనిపోవడం తో ఆ తల్లి దండ్రులు కుమిలిపోతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మహేష్ డెడ్ బాడీ ని భారత్ కు తిరిగి పంపించలేమని అక్కడి అధికారులు తెలిపినట్లు సమాచారం. అయితే మహేష్ అంత్యక్రియలను వాట్సాప్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏజెంట్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news