మోనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 సంవత్సరాల తరువాత ఎక్కువమంది మహిళల్లో ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. పీరియడ్స్ శాశ్వతంగా ఆగిపోడాన్ని సూచిస్తుంది. ఈ దశలో హార్మోన్స్ లో మార్పులు జరగడం వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. అందరిలో సమస్యలు తలెత్తకపోవచ్చు కానీ కొందరైతే మోనోపాజ్ టైంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ టైం లో సాధారణంగా వచ్చే సమస్యలు వాటి ఉపశమన మార్గాలను మనం వివరంగా తెలుసుకుందాం..
శరీరం వేడి ఆవిరి: మోనోపాజ్ టైం లో శరీరంలో ఆకస్మిక వేడి, చెమట ముఖ్యంగా ముఖం, మెడ, చాతి భాగాల్లో అసౌకర్యంగా ఉంటుంది. రాత్రిపూట సరిగా నిద్ర లేకపోవడం మొదట పడుకోగానే కొంత నిద్ర పట్టి సడన్ గా నైట్ మధ్యలో మెలకువ రావడం వంటివి జరుగుతూ ఉంటాయి.
మానసిక మార్పులు: మోనోపాజ్ టైం లో ఆందోళన, ఒత్తిడి, మూడు స్వింగ్స్, డిప్రెషన్ చిరాకు వంటివి ఎక్కువగా మహిళల్లో కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు వారి ఏకాగ్రత తగ్గుతుంది జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తుతాయి. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడడం, చిన్న సమస్యకు ఆందోళన చెందడం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.

మూత్ర సమస్యలు: సాధారణంగా 45 సంవత్సరముల తరువాత ఈ మోనోపాజ్ ఏర్పడుతుంది. ఈ టైం లో మహిళలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిలో యోని పొడిబారడం దురద, భాగస్వామితో శారీరక సంభోగంలో అసౌకర్యం, తరచూ మూత్ర విసర్జన మూత్ర సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈస్ట్రోజెన్స్ స్థాయి తగ్గడం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. అంతేకాక మెటబాలిజం మందగించి జీవక్రియ సరిగా లేక బరువు పెరగవచ్చు.
ఈ సమస్యలను ఎదుర్కోవడానికి మన జీవనశైల్లో కొన్ని మార్పులు, వైద్య చికిత్సలు, సహజ పద్ధతులను ఉపయోగించవచ్చు కొన్ని సమర్థవంతమైన మార్గాలను మనము తెలుసుకుందాం..
జీవనశైలిలో మార్పులను చేసుకోవడం ముఖ్యంగా ఆహారం పై ప్రత్యేక సర్ద చూపాలి. క్యాల్షియం విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు, ఎముకలు ఆరోగ్యానికి సహాయపడే పాల ఉత్పత్తులను ఉపయోగించాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే అవిస గింజలు, చేపలను తీసుకోవాలి. రోజు 30 నిమిషాలు వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం లాంటివి మన అలవాట్లలో ఒక భాగం చేసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వలన మోనోపాజ్ టైం లో వచ్చే సమస్యలకు కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. సమస్య తీవ్రతను బట్టి వైద్యున్ని సంప్రదించండి.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దగ్గర్లోని డాక్టర్ ను సంప్రదించండి.)