తాడిపత్రి పొలిమేర వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నారు పెద్దారెడ్డి. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. తాడిపత్రికి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. శాంతి భద్రతల సమస్య కారణంగా పెద్దారెడ్డిని అడ్డుకున్నట్లు చెబుతున్నారు పోలీసులు.

అయితే దీనిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. AP హైకోర్టు ను లెక్క చేయని రెడ్ బుక్ ప్రభుత్వం..న్యాయస్థానం ఆదేశాలను బహిరంగంగా అవమానపరుస్తోందని మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను ఈ రోజు తాడిపత్రి కి వెళుతున్నాను అని పేర్కొన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి కి ఎవ్వరూ రావద్దని నేను మా కార్యకర్తలు చెప్పానని వెల్లడించారు పెద్దారెడ్డి.అయినా కూడా పోలీసులు పంపించడం లేదని ఆగ్రహించారు పెద్దారెడ్డి. దింతో తాడిపత్రి పొలిమేర వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నారు పెద్దారెడ్డి.
AP హైకోర్టు ను లెక్క చేయని రెడ్ బుక్ ప్రభుత్వం..
న్యాయస్థానం ఆదేశాలను బహిరంగంగా అవమానపరిచిన ప్రభుత్వ పోలీసులు.తిమ్మంపల్లి నుండి తాడిపత్రి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డుకోవడం…
హైకోర్టు వారు ఇప్పుడు ఏమి చేస్తారు??? pic.twitter.com/jDUazcxLzr
— VenkataReddy karmuru (@Venkat_karmuru) August 18, 2025