సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో కోటి ఓట్లు కొత్తగా చేర్చిందని ఆరోపణలు చేసారు. 4 నెలల్లో ఏ రాష్ట్రంలో అయినా కోటి మంది పుట్ట గలరా.. పుట్టినా వాళ్ళకి ఓటు హక్కు వస్తుందా ? అని నిలదీశారు. దొంగ ఓట్లు చేర్చడం వల్లనే మహా రాష్ట్ర లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.

రవీంద్రభారతిలో శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి వేడుకలు జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎక్కడైనా 4 నెలల్లో కోటి మంది పుడతారా? ఒకవేళ పుట్టారనుకున్నా వాళ్లకు అప్పుడే ఓటు హక్కు వస్తదా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి బీజేపీ అధికారంలోకి వచ్చిందని బాంబు పేల్చారు.