డయాబెటిస్( షుగర్) ఆయుర్వేదంలో మధుమేహం అని పిలుస్తారు. ఇది శరీరంలో చాలా నిశ్శబ్దంగా ప్రవేశించే వ్యాధిగా చెప్పుకుంటారు. వయసు పైబడిన వారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది శరీరంలోని కఫ, పిత్త దోషాల వలన వస్తుంది. షుగర్ ను మొదట్లోనే గుర్తించి అదుపులో ఉంచడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను నిపుణులు పేర్కొన్నారు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం..
ఆహార నియమాలు: చేదు రుచిగల ఆహారాలు తీసుకోవాలి. మెంతులు, ఆమ్లా, బఠానీ, వంటివి రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రిస్తాయి. ఈ ఆహార పదార్థాలను రోజువారి వంటలలో ఉపయోగించాలి. బార్లీ గింజలు, గోధుమలు, జొన్నలు వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల ధాన్యాలను ఆహారంలో భాగంగా ఎంచుకోవాలి. ఇక చక్కెర, తేనె, బెల్లం వంటి ఆహారాలతో పాటు మైదా పదార్థాలను తగ్గించాలి.
మూలికల వాడకం: విటమిన్ సి అధికంగా ఉండే ఆమ్లా రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది రోజు రెండు టీ స్పూన్ల ఆమ్ల రసం తీసుకోవచ్చు. రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను ఉదయం తినడం వల్ల గ్లూకోస్ స్థాయి తగ్గించవచ్చు. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా వాడితే ఫలితం కనిపిస్తుంది. ఇక అంతేకాక ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చ నీటిలో కలిపి తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

జీవనశైలి: డయాబెటిస్ సమస్య కేవలం ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటిస్తే సరిపోదు కొంత మన జీవనశైలిలో కూడా మార్పులు తీసుకురావాలి. ఉదయం యోగ, వ్యాయామం లాంటివి చేయడం సూర్య నమస్కారాలు, భుజంగా ఆసనాలు వంటి యోగాసనాలు వేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి షుగర్ నియంత్రణలోకి వస్తుంది. రోజు క్రమం తప్పకుండా 30 నిమిషాలు నడక, తేలికపాటి వ్యాయామాలు చేయడం ముఖ్యం.
పంచకర్మ చికిత్స: ఆయుర్వేద వైద్యుని సలహాతో పంచకర్మ వంటి శుద్ధి చికిత్సలు శరీరంలో విష పదార్థాలను తొలగించి, జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇక అంతేకాక రాత్రి ఎనిమిది గంటలు నిద్ర ధ్యానం, ప్రాణాయామం చేయడం వలన ఒత్తిడి తగ్గించి హార్మోన్లను సమతుల్యంగా కాపాడతాయి.
జాగ్రత్తలు: ఆయుర్వేద చిట్కాలను అమలు చేయడానికి ముందు ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారు అల్లోపతి మందులు వాడుతున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత ఆయుర్వేద వైద్యుడి సలహాతో వీటిని వాడాలి. ఈ చిట్కాలు ఆరోగ్యకరమైన జీవన శైలితో పాటు అనుసరిస్తే షుగర్ ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహనా కోసం మాత్రమే, ఆరోగ్య సమస్య వస్తే వైద్యుడి ని సంప్రదించండి.)