సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటి నటులు మృతి చెందగా తాజాగా మరో నటుడిని కోల్పోయింది సినిమా ఇండస్ట్రీ. తీవ్ర అనారోగ్యం కారణంగా 3 ఇడియట్స్ మూవీ సినిమా నటుడు మృతి చెందారు. ప్రముఖ నటుడు అచ్యుత్ పోత్దార్ 91 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.

అనారోగ్య కారణాలవల్ల మహారాష్ట్రలోని తానే లో ఉన్న జుపిటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే అచ్యుత్ పోత్దార్ మరణించినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. సినిమాలలో తనదైన ముద్ర వేయడానికి ముందుగా… భారత సాయుధ దళాలలో పనిచేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి దాదాపు 125 సినిమాలలో నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో ఆయన కనిపించారు. ఇక అచ్యుత్ పోత్దార్ మృతి నేపథ్యంలో.. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.