ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న అమూల్యమైన వస్తువు ఏది అంటే స్మార్ట్ ఫోన్ అని టక్కున చెప్తారు. ఇది కావలసిన మేర వాడుకుంటే అమూల్యమైన వస్తువే కానీ ఎక్కువగా వాడితే ప్రమాదకరం. స్మార్ట్ ఫోన్ చేతిలోకి రాగానే మన వేళ్ళు అప్రమత్తంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షాట్స్ వైపుకు వెళ్ళిపోతాయి.కేవలం కొన్ని నిమిషాలే చూద్దాం అనుకొని ఓపెన్ చేస్తాం కానీ గంటల తరబడి వాటిలో మునిగిపోతున్నాం అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ రీల్స్ వ్యసనంలో చిక్కుకుంటున్న వారిలో ఎక్కువ మంది యువత ఉండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ చిన్న వీడియోలు మనకు వినోదాన్ని పంచుతున్నట్లే కనిపించిన మన అమూల్యమైన సమయాన్ని మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ మాయా ప్రపంచం యువత పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..
రీల్స్ మాయాజాలంలో యువత : ఒకప్పుడు కాలక్షేపం కోసం ఉద్దేశించి చేసిన రీల్స్, ఇప్పుడు మన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రిల్స్, యూట్యూబ్ షాట్స్ వంటి చిన్న వీడియో ప్లాట్ఫారం లు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం 30 నుంచి 60 సెకండ్లలో కళ్ళు చెదిరే వినోదాన్ని హృదయానికి అందిస్తున్నాయి. అందుకే యువత వాటికి బానిసలు అయిపోతున్నారు. పైకి కనిపించే ఈ వినోదం వెనుక దాగి ఉన్న ప్రమాదాలను గుర్తించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును మీరు విన్నది నిజమే ఇవాళ వీల్స్ చూస్తూ ఉంటే మన శరీరంపై మన మనసుపై ఎంతో ప్రభావం చూపుతాయి.

భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం:ఇక ఇంతే కాక ఫోన్ లో మునిగిపోతే ఎన్నో సమస్యలను కొనితెచ్చుకున్నటు, ముఖ్యంగా యువత విద్యార్థులు చదువును, ఉద్యోగాన్ని తమ ముఖ్యమైన పనులను పక్కనపెట్టి గంటలు తరబడి రీల్స్ చూస్తూ ఉండడంలో కాలం గడుపుతున్నారు. ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మెదడు నిరంతరం కొత్త సమాచారంతో నిండిపోవడం వల్ల ఒక పనిపై ఏకాగ్రత పెట్టడం కష్టమవుతుంది. ఫలితంగా రోజువారి పనుల్లో కొన్నిటిని తగ్గించుకుంటాం. ఈ రీల్స్ చూసే వ్యసనానికి అలవాటు పడిపోయిన వారు వారి ప్రపంచంలో ఎక్కువ సమయం గడుపుతారు.దీని వల్ల కుటుంబ సభ్యులతో స్నేహితులతో గడిపే సమయాన్ని పూర్తిగా తగ్గిస్తున్నారు. ఇది మానవ సంబంధాలను బలహీన పరుస్తుంది.
ఆరోగ్య సమస్యలు:ఇక ఆరోగ్య విషయానికి వస్తే నిరంతరం రీల్స్ చూస్తూ ఉండడం వల్ల మనలోని అభద్రతాభావం అసూయ ఆందోళన పెరుగుతాయి ఇది దీర్ఘకాలికంగా డిప్రెషన్కు దారితీస్తుంది. వేగంగా మారిపోయే వీడియోలు నిరంతరం చూడడం వల్ల మెదడు అదే వేగానికి అలవాటు పడుతుంది. దీని వల్ల పుస్తకాలు చదవడం చదువుపై శ్రద్ధ పెట్టడం వంటి ఏకాగ్రత అవసరమయ్యే పనులు తరువాత కష్టమవుతాయి. ఇక అంతేకాక రాత్రిపూట ఎక్కువ గంటల తరబడి ఫోన్ చూస్తూ స్క్రీన్ ని మన కళ్ళకి దగ్గరగా పెట్టుకోవడం వల్ల కళ్ళపై ఒత్తిడి పడి మెదడు చురుకుతనం తగ్గిపోతుంది. ఇక అంతేకాక ఒకే చోట ఎక్కువసేపు కదలకుండా కూర్చుని రీల్స్ చూడడం వల్ల మెడ నొప్పి, వెన్నునొప్పులు, ఊబకాయం వంటి శారీరక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
టెక్నాలజీని వినోదం కోసం ఉపయోగించడం తప్పుకాదు, కానీ దానికి బానిసలు కావడం ప్రమాదకరం. రీల్స్ ప్రపంచం నుండి బయటకు వచ్చి నిజజీవితంలో ఆనందాలను ఆస్వాదించడం చాలా ముఖ్యం.