మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. యూరియా కోసం రోడెక్కి ధర్నా చేసే వాళ్ళు నిజమైన రైతులు కాదు అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాంబు పేల్చారు. కొంతమంది కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

యూరియా అవసరం ఉన్న అసలు సిసలైన రైతుల వల్ల తమకేమీ ప్రాబ్లం లేదని… కానీ కొంతమంది కావాలనే రోడ్లు ఎక్కుతున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై రైతులు మండిపడుతున్నారు. వెంటనే తుమ్మల నాగేశ్వరరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా యూరియా కోసం వచ్చి క్యూ లైన్లో సోమ్మసిల్లి కిందపడ్డాడు ఓ రైతు.. అతనికి తల పగిలి తీవ్ర గాయం అయింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బుర్కితండా గ్రామపంచాయతీలో మల్లమ్మ కుంట తండాకు చెందిన అజ్మీరా లక్క, విజయ అనే దంపతులకు 20 రోజులైనా యూరియా దొరకడం లేదని ఇవాళ ఇస్తున్నారని తెలిసి భార్య భర్తలు వచ్చి లైన్లో నిలబడ్డారు. అయితే లక్కకు గతంలో పక్షపాతం ఉండగా అదే బాధలో యూరియా కోసం రాగా లైన్లో నిలబడి ఒకసారిగా సొమ్మసిల్లి మెట్ల పైనుంచి కింద పడడంతో తల పగిలి తీవ్ర గాయం అయింది.