ఆ ఆడియో ఎమ్మెల్యే దగ్గుపాటిదే : ధనుంజయ నాయుడు

-

ఆ ఆడియో ఎమ్మెల్యే దగ్గుపాటిదే, ఆడియోని నేనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రూప్ లో షేర్ చేశా అని పేర్కొన్నారు ధనుంజయ నాయుడు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎందుకు ఎలా మాట్లాడాడో తెలియదని చెప్పారు. ఎన్టీఆర్ తల్లిని తిడితే మా అందరి తల్లులని తిట్టినట్లే అని మండిపడ్డారు. నను కూడా ఎమ్మెల్యే చాలా బూతులు తిట్టాడని చెప్పారు ధనుంజయ నాయుడు.

dhanunjaya
dhanunajaya on daggubati venkateswara prasad audi

జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే కాల్ రికార్డింగ్‌ ఇష్యూలో కీలక పరిణామం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే కాల్ రికార్డింగ్‌ను లీక్ చేసిన ధనుంజయ నాయుడుకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నుంచి నాకు ప్రాణహాని ఉందని తాజాగా వెల్లడించారు ధనుంజయ నాయుడు.

నన్ను నా ఫ్యామిలీని చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ ఆడియో కాల్ ఫేక్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని నాపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు ధనుంజయ నాయుడు. ఎమ్మెల్యే దగ్గుబాటి అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉందన్నారు. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ధనుంజయ నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news