ఈనెల 24న చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది. చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం కానున్న తరుణంలో మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

గంగాధర మండలం ఉప్పరమల్యాల నుంచి మధురానగర్ వరకు పాదయాత్ర ఉంటుంది. ఈ పాదయాత్రలో ప్రజాసమస్యలు తెలుసుకోనున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. అటు నేటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఇవాళ ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి… హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నట్లు ముందుగా ప్రకటన వచ్చింది. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఉంది.