ఏసీబీ అధికారులు (ACB officials) అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. లంచం డిమాండ్ మాట వినిపిస్తే విరుచుకుపడుతున్నారు. ఎక్కడికక్కడ సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవినీతి కట్టడికి తీవ్రంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఏపీ కార్మిక శాఖ(AP Labor Department)పై దృష్టి పెట్టారు. ఆ శాఖ జాయింట్ కమిషనర్ బాలునాయక్ అవినీతి చిట్టా బయటకు లాగుతున్నారు.
ఇందు కోసం తిరుపతి (Tirupati), కర్నూలు (Kurnool) సహా ఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. బాలు నాయక్ ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాలున్న అన్ని చోట్ల కూడా సోదాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ తనిఖీలు సంచలనంగా మారాయి. ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట నిత్యం అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అవినీతికి పాల్పడటం దారుణం అనే చెప్పాలి.