అసెంబ్లీలో RSS గేయం ఆలపించిన డీకే శివకుమార్..!

-

ప్రస్తుతం రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఎప్పుడూ ఏ పార్టీలో ఏ వ్యక్తి కొనసాగుతారో ఊహించడం చాలా కష్టం అవుతుందనే చెప్పవచ్చు. కొందరూ సొంత పార్టీలో మాత్రమే కొనసాగుతారు. మరికొందరూ ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో కొనసాగించి.. వారు తమ రాజకీయ పార్టీలను కొనసాగిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. అయితే కర్ణాటకలో ఎన్నికలు జరిగినప్పుడు సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డీకేశికుమార్ మధ్య కుర్చీలాట జరిగిన విషయం తెలిసిందే.

dk

తాజాగా కర్నాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీ.కే. శివకుమార్ తన రాజకీయ ప్రస్థానం పై మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గేయం ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నమస్తే.. సదా వత్సలే మాతృభూమే ని పాడటంతో బీజేపీ ఎమ్మెల్యేలు బల్లలు చరిచారు. కాగా డీకే శివకుమార్ యువకుడిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం కుర్చీ ఇవ్వకుంటే తాను బీజేపీలో చేరుతానని సిద్ధరామయ్యకి ఇప్పటికే డీకే శివకుమార్ హింట్ ఇచ్చారని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news