పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ తగిలింది. ఈ తరుణంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పుకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్.

వీరిని పిలిపించుకొని వివరణ తీసుకోనున్నారు స్పీకర్. తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి పిలిపించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇది ఇలా ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ తరఫున పదిమంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో… పార్టీ కండువా మార్చేశారు. పార్టీ కండువా మార్చడమే కాకుండా కాంగ్రెస్ సమావేశాలకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళపై న్యాయం పోరాటం చేస్తుంది గులాబీ పార్టీ. దానికి తగ్గట్టుగానే సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు గడ్డం ప్రసాద్.