ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆర్టీసీ సంస్థ. ఏపీలో… ఫ్రీ బస్సులో భాగంగా మరికొన్ని బస్సులు తీసుకు వస్తున్నామని తాజాగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు ద్వారా ప్రతిరోజు 21 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.

తొలి వారం కోటి మంది స్త్రీ శక్తి ప్రయాణాలు చేసినట్లు ఈ సందర్భంగా ప్రకటన చేశారు తిరుమలరావు. దీని ద్వారా మహిళలకు వారంలో 41.22 కోట్ల లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు. అటు బస్సులలో రద్దీని తగ్గించేలా త్వరలోనే వెయ్యి 50 ఎలక్ట్రిక్ బస్సులు, 1500 ఇతర బస్సులను తీసుకువస్తున్నామని ప్రకటన చేశారు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు. దీంతో ఏపీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.