ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రంలోని హైవేలపైన టోల్ ఛార్జీలను మహారాష్ట్ర ప్రభుత్వం మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అటల్ సేతు, పూనే ఎక్స్ప్రెస్ వే, సమృద్ధి మహా మార్గ్ లపైన ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ చార్జీలను మినహాయించారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాలకు ఇదే విధానం విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. కాలుష్యం తగ్గించడం, EV ల కొనుగోలు ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు టోల్ ఫ్రీ ఛార్జీలను ఎక్కువ మొత్తంలో వసూలు చేయడంతో వాహనదారులు కాస్త ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎలక్ట్రిక్ వాహనాదారులు. ఈ విషయం తెలిసిన అనంతరం అన్ని రాష్ట్రాలలో ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ ఛార్జీలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు జనాలు. అంతేకాకుండా టోల్ ఫ్రీ చార్జీలను కొంతమేర తగ్గించాలని కోరుతున్నారు. చాలా ఎక్కువ మొత్తంలో టోల్ ఫ్రీ ఛార్జీలు వసూలు చేయడంతో కాస్త ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు వాహనాదారులు.