సహస్ర హత్య కేసులో సంచలన విషయాలను వెల్లడించారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజుల క్రితం సహస్ర తమ్ముడు క్రికెట్ ఆడుకోవడానికి బ్యాట్ ఇవ్వకపోవడంతోనే వారి ఇంటికి దొంగలించడానికి వెళ్ళాడని పోలీసుల విచారణలో తేలింది. బ్యాట్ తీసుకుని వస్తుండగా సహస్ర గట్టిగా అరవడంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచాడు. తన తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనంగా ఉండడంతోనే తాను బ్యాట్ కొనుక్కోలేకపోయాడని అతడు చెప్పాడని పోలీసులు స్పష్టం చేశారు.

ఆ బాలుడు స్కూలుకు కూడా సరిగ్గా వెళ్లేవాడు కాదని ఎక్కువగా క్రైమ్ స్టోరీలు చూస్తూ ఉండేవాడని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా…. ఆ బాలుడు సహస్ర ఇంట్లో డబ్బులు దొంగలించడానికి వెళ్లినట్లుగా అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. డబ్బులు దొంగలించిన అనంతరం సహస్ర గట్టిగా అరవడంతో కత్తితో పొడిచాడని ఏకంగా 20 సార్లు కత్తితో ఇష్టం వచ్చినట్లుగా సహస్ర ఒంటిపై పొడిచినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆ బాలుడికి కఠినమైన శిక్ష విధించాలని సహస్ర బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.