తెలుగుదేశం పార్టీకి టీవీ చానెల్ లేదు.. పేపర్ లేదు..వైఎస్ జగన్ కు టీవీ, పేపర్ ఉన్నాయి.. మా పార్టీకి, పవన్ పార్టీకి లేవు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.

దొంగలకు పింఛన్లు ఇచ్చారు.. వికలాంగులు కాని వాళ్లని కూడా వికలాంగులంటూ పింఛన్లు ఇచ్చారన్నారు. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్లందరికీ తీసేసి మీకే ఇస్తామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. వేరే పార్టీ వైపు చూడకండి.. మీరందరిది ఒకటే దారి అది ఎన్డీయే దారి కావాలి.. రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఆశీర్వదించే బాధ్యత మీదే అని చెప్పారు.
తెలుగుదేశం పార్టీకి టీవీ చానెల్ లేదు.. పేపర్ లేదు..
వైఎస్ జగన్ కు టీవీ, పేపర్ ఉన్నాయి.. మా పార్టీకి, పవన్ పార్టీకి లేవు..
– సీఎం చంద్రబాబు pic.twitter.com/KPKcxJ2noc
— Telugu Feed (@Telugufeedsite) August 23, 2025