ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఆహారం నుండి అన్నిట్లో జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలు ఆడేటప్పుడు గాయాలు అవ్వడం లేదా పెరుగుతున్నప్పుడు కొన్ని నొప్పులు రావడం ఈ లక్షణాలు సర్కోమా సంకేతాలను పోలి ఉండడం వల్ల తల్లిదండ్రులు కొన్నిసార్లు వైద్యులు కూడా దీన్ని గుర్తించలేకపోవచ్చు. అందుకే ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సర్కోమా అంటే ఎముకలు, కార్టిలేజ్, మృదు కణజాలంలో వచ్చే క్యాన్సర్. మరి ఈ వ్యాధి గురించి, లక్షణాలు గురించి తెలుసుకుందాం..
పిల్లలు ఆరోగ్యం తల్లిదండ్రులకు అమూల్యమైన సంపద. ఆహారం, వ్యాయామం, జీవనశైలి వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు కష్టపడతారు.ఈ వ్యాధి సాధారణ నొప్పి లేని గడ్డ లేదా వాపు రూపంలో ప్రారంభం అవుతుంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు కానీ ఎక్కువగా చేతులు, కాళ్లు,పొట్ట,ఛాతి పై కనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ ఇతర సాధారణ సమస్యలు మాదిరిగానే కనబడతాయి.శరీరం పై ఒక గడ్డ రెండు వారాలకు పైన ఉంది, దాని పరిమాణం పెరుగుతూ ఉంటే అప్పుడు అనుమానించాలి. అయితే కొంతమంది సర్కోమా వంటి అరుదైన క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి అత్యంత శుద్ధ తీసుకోవడం అవసరం. ఇది మొత్తం క్యాన్సర్లలో 20% మాత్రమే కనిపిస్తుంది ఇది పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది.

చర్మం కింద ఒక గడ్డ ఏర్పడడం ఇది మొదట్లో నొప్పి లేకుండా ఉండొచ్చు కానీ పెరిగే కొద్ది నొప్పిగా మారుతుంది. శరీరంలో ఒక ప్రాంతంలో ఎముక నొప్పి రావడం, రాత్రి వేళల్లో శరీరం ఎక్కువ శ్రమించినప్పుడు ఆ నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్న గాయం లేకపోయినా కూడా ఎముక విరిగిన అంత నొప్పి వస్తుంది. శరీరంలో వచ్చిన గడ్డ కీళ్ల దగ్గర ఏర్పడితే కీళ్లు కదలికలకు ఆటంకం కలుగుతుంది కారణం లేకుండా బరువు తగ్గడం, జ్వరం, అలసట, రక్తహీనత వంటివి కూడా ఈ వ్యాధి లక్షణాలు కావచ్చు.
ఈ వ్యాధి రెండు ప్రధాన రకాలుగా విభజించబడింది. ఎముక సర్కోమా మరియు మృదుకనజాల సర్కోమా ఇవి సాధారణంగా 10 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలలో కనిపిస్తాయి. లక్షణాలు నొప్పి వాపు, ఎముకలు బలహీనత, కదలికల్లో ఇబ్బంది ఉండవచ్చు. ఈ లక్షణాలు సాధారణ గాయాలతో మొదలై పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఒకవేళ మీ పిల్లలలో పైన చెప్పిన లక్షణాలు ఏవైనా కనిపిస్తే తక్షణమే వైద్యుని సంప్రదించడం ముఖ్యం సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహనా కోసం మాత్రమే)