రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 25 మంది ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పై క్లారిటీ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డితో అంతర్గతంగా విభేదాలున్నా, పార్టీ చీలిక ఆలోచన నాలో లేన్నారు. సన్నిహిత ఎమ్మెల్యేలు క్యాజువల్‌గా నన్ను కలిశారు.. అది అంతర్గత భేటీ కాదు అని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఇక అటు గులాబీ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే పరిస్థితి నెలకొంది. అనర్హత వేటుకు ముందే రాజీనామా చేసేందుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారట.