అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది. రేపు మన్యం విజయనగరం అల్లూరి అలాగే శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.

ఇతర చోట్ల తేలికపాటి వానలు పడతాయని కూడా స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఇక అటు ఈ అల్పపీడనం ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం పైన కూడా ఉండనుంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మేడ్చల్ ఖమ్మం రంగారెడ్డి… ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ఈ జిల్లాలలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది.