Edupayala: కాస్త శాంతించిన మంజీరా నది.. ఏడుపాయల దగ్గర పరిస్థితి ఇదే

-

మంజీరా నది..కాస్త శాంతించింది. ఐన కూడా 11వ రోజు సైతం ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం మూసివేశారు. బురద, గడ్డి, నాచుతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. ఆలయం ఎదుట స్వల్పంగా వరద కొనసాగుతోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.

Edupayala temple, manjeera river
Edupayala temple, manjeera river

కాగా ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిలో భారీ వర్షాలు పడనున్నాయి.. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు వర్షాలు పడనున్నాయి. మరోవైపు, తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ జారీ చేసింది IMD.

 

Read more RELATED
Recommended to you

Latest news