ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్బంగా హాస్టల్ భవనాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.10 కోట్లతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ పనులకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీలో పెద్దఎత్తున పెండింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వర్సిటీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు విద్యార్థులు.

ఇక అటు భద్రతా వలయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కేవలం తమ అనుకూల మీడియాకు మాత్రమే లోపలికి అనుమతిస్తూ మిగతా వారిని ఆపేసారు పోలీసులు. మెయిన్ గేట్ నుండి 3 కిలోమీటర్లు కాలి నడకన పలు సెక్యూరిటీ తనిఖీలు దాటుకొని వచ్చిన మీడియా ప్రతినిధులను ఠాకూర్ ఆడిటోరియం వద్ద నిలిపివేశారు పోలీస్ అధికారులు. ఈ మాత్రం దానికి ఎంట్రీ పాసులు ఎందుకు ఇచ్చారంటూ మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి
హాస్టల్ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్
రూ.10 కోట్లతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ పనులకు శ్రీకారం
వర్సిటీలో పెద్దఎత్తున పెండింగ్ పోస్టుల భర్తీ
వర్సిటీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్న విద్యార్థులు https://t.co/rRcm6S1vVX pic.twitter.com/hVBBAvf2Jx
— BIG TV Breaking News (@bigtvtelugu) August 25, 2025