హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలో ఒకటి వినాయక చవితి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. వీధుల్లో, గ్రామాల్లో పట్టణాలలో ప్రతి చోటా వినాయకుడి విగ్రహాలు నెలకొల్పి భక్తులు పూజలను చేస్తారు. వినాయకుడు ను ఆరాధించే ప్రత్యేకమైన రోజు. ఈ పండుగలో పూజ మాత్రమే కాక, ప్రసాదం కీలకపాత్ర పోషిస్తుంది. గణేశుడికి ఇష్టమైన ఆహారాలను సమర్పించడం ద్వారా భక్తులు ఆయన ఆశీస్సులు పొందుతారు. మరి అలాంటి ప్రసాదాల్లో తప్పక పెట్టవలసిన ప్రసాదం గురించి మనము తెలుసుకుందాం..
వినాయక చవితి నివేదనలో కుడుములు, లడ్లు, బెల్లం పాయసం మాత్రమే ముఖ్యమైనవి అని అనుకుంటారు కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది పురాణాలు చెబుతున్నది వినాయక చవితి రోజు ఆ గణేశుడికి దోస పండు నైవేద్యం పెట్టడం ఎంతో ముఖ్యం. అంతేకాక ఎంతో విశేషమైనది. మిగిలిన రోజుల్లో కొబ్బరికాయ కొట్టి ఆయనకి ఇష్టమైన కుడుములు నివేదనలో పెడతాం కానీ, వినాయక చవితి పూజలో ఉండ్రాళ్లతో పాటు దోస పండును నైవేద్యంగా పెట్టాలి. పురాణాల ప్రకారం గణేశుడికి ఆకలి తీర్చేందుకు పార్వతీదేవి దోసకాయని ఇచ్చారట, అందుకే వినాయక చవితి రోజు పూజలో ఈ దోస పండు నైవేద్యం పెడితే వినాయకుని అనుగ్రహం కలుగుతుందని పెద్దలు,గురువులు చెబుతున్నారు.
అన్నితీపి ప్రసాదాలు గణేశునికి అత్యంత ఇష్టమైనవిగా చెప్పబడతాయి.అందులో కుడుములు బియ్యప్పిండితో తయారుచేసి ఆవిరిలో ఉడికించి వండుతారు. ఇవి సహజమైన రుచిని పవిత్రతను సూచిస్తాయి ఇవి బెల్లం లేదా పప్పులతో నింపబడి గణేషుడికి సమర్పించబడతాయి. కుడుములు తయారీ సులభంగా ఉంటుంది కానీ భక్తితో చేయడం ప్రధానం.

ఇక అంతేకాక లడ్డూలు తీపి వంటకాలలలో ఒకటి. నెయ్యి,, చక్కెర రవ్వతో తయారయ్యే ఈ లడ్లు గణేశుడికి ఎంతో ఇష్టమైనవి. ఈ లడ్లు తయారు చేసేటప్పుడు నెయ్యి వాసన, రవ్వ యొక్క సుగంధం గణనాథుడను ఆహ్వానిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
బెల్లం పాయసం నివేదించడం ఎప్పటి నుంచే వస్తున్న ఆచారం. ఇది బెల్లం, బియ్యం, పాలు మరియు యాలకులతో తయారవుతుంది. ఈ పాయసం గణేష్ కు సమర్పించడం ద్వారా భక్తులు సంతోషం సౌభాగ్యం పొందుతారని నమ్ముతారు.
ఈ ప్రసాదాలను తయారు చేసేటప్పుడు చిత్తశుద్ధి, భక్తి, పవిత్రతను పాటించడం చాలా ముఖ్యం. ఈ పండుగ నాడు వినాయకుడికి సంతోషపెట్టి వారి జీవితంలో శాంతి, ఆనందాన్ని పొందడానికి భక్తులు ఈ నైవేద్యాన్ని పెడతారు.