టీమిండియా స్టార్ క్రికెటర్ హనుమ విహారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు గుడ్ బై చెప్పాడు హనుమా విహారి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు హనుమ విహారి. త్రిపురకు ప్రాతినిధ్యాన్ని త్వరలోనే వహించబోతున్నాడు. 2025 నుంచి 2026 సీజన్ దేశవాలి క్రికెట్ లో త్రిపుర తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు తెలుగు కుర్రాడు హనుమ విహారి.

ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ఓసి కూడా మంజూరు కావడం జరిగింది. విహారి ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఎంపిక కాకపోవడం అని సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా హనుమ విహారి పై కుట్రలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగింది.