తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా గ్రామాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా సూర్యాపేట అలాగే ఖమ్మం ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పురాతన ఇళ్లల్లో ఉండే ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వాగులు అలాగే కాజువెల్ అటు కల్వర్టులపై రాకపోకలు నిషేధించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు అలాగే గుంటలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అంటువ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ పనులు చేయాలని.. వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.