విజయవాడ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు అలర్ట్.. ఈ రోజు నుంచి ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులే ధరించాలని ఆదేశించారు. లేకపోతే ఆలయంలోకి అనుమతి నిరాకరిస్తారు. సెల్‌ఫోన్లపై కూడా నిషేధం ఉంటుంది. భక్తులెవరూ సెల్‌ఫోన్స్‌తో ఆలయంలోకి వెళ్లకూడదని స్పష్టం చేసారు. లేదంటే లోనికి అనుమతి ఉండదన్నారు.

ఆలయ సిబ్బందికి కూడా సేమ్ రూల్స్ విధింపు చేశారు ఇంద్రకీలాద్రి ఆలయ EO. ఇకపై వాకీటాకీలతోనే సిబ్బంది పర్యవేక్షణ చేయనున్నారు. ఐడి కార్డులు తప్పనిసరి చేసారు. భక్తులు అసభ్యకర దుస్తుల్లో రావడం, లోపల వీడియోలు తీసి నెట్టింట్లో వైరల్ చేస్తుండటం వల్లే.. ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.